వినుడు హరి యండగా మనకుండగ
మనసుచెదరు టన్నది మన కుండదుగా
హరినామామృతము రుచిమరగిన జిహ్వ
సరిగా నితరముల నెన్న సాహసించేనా
హరేరామ హరేకృష్ణ యనునే కాని
మరొక మంత్రమునకు జేర మనసుపడేనా
పరబ్రహ్మతత్త్వమందు పరగెడు బుధ్ధి
అరకొర తత్త్వముల వంక పరుగులెత్తేనా
పరబ్రహ్మ మనుచు శ్రీహరినే జూపు
మరి యన్యుని జూపుటకు మనసుపడేనా
హరి మోక్షప్రదాత యని యరసిన జీవి
కొరగానివి తెలివిమాలి కోరుకొనేనా
హరిని మోక్ష మిమ్మనుచు నడుగును కాని
మరి యొక జన్మమును పొంద మనసుపడేనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.