7, ఫిబ్రవరి 2024, బుధవారం

దశకంఠవిరోధి వందనము వందనము


దశకంఠవిరోధి వందనము వందనము హరి
దశరథుని కొడుక వందనము వందనము

జానకీశ వందనము జగన్నాథ వందనము
మానవేంద్ర వందనము మహితతేజ వందనము
దానవారి వందనము దయాశాలి వందనము
దీనావన వందనము దివ్యతేజ వందనము

కామజనక వందనము ఘనశ్యామ వందనము
కోమలాంగ వందనము గుణాతీత వందనము
రామచంద్ర వందనము రమ్యరూప వందనము
ప్రేమాలయ వందనము క్షేమాలయ వందనము

కరివరద వందనము సురవరద వందనము
వరదాయక వందనము నిరుపాధిక వందనము
కరుణాకర వందనము నిరుపమాన వందనము
పరమయోగిబృందవంద్యపరమపురుష వందనము