13, ఫిబ్రవరి 2024, మంగళవారం

అరయలేరో

అరయలేరో మీరంబుజాక్షుని

నరపతికులతిలకుని నారాముని


అతడే ముల్లనికములకు నన్నదాత యని

అతడే సద్భక్తకోటి నాదరించు హరి యని

అతడే సురవైరిలోకప్రతారణుడు హరియని

అతడే సకలాగమములు నుతియించు హరి యని


అతడే నారదతుంబురునుతుడైన హరి యని

అతడే మౌనులకు మోక్షవితరణుడు హరి యని

అతడే యోగీంద్రహృదయసతతవాసి హరి యని

అతడే పరమేష్ఠి తండ్రియైన శ్రీహరి యని


అతడే మన కెపుడును చేయందించెడు హరి యని 

అతడే మనకందరకును పతియగు శ్రీహరి యని

అతడే జీవులకు పరమగతి యైన హరి యని

అతడే తనివార పొగడ నర్హుడైన హరి యని