కనుగొన నిది చిత్రముగా ననిపించును
జనులారా మీతీరు జగతిని నాకు
వినరేల హరినామమును చెవులార
కనరేల హరిరూపమును కనులార
అనరేల హరినామమును మనసార
జనులార యివి చాలు ననుకొన రేల
తనివార హరిపాటలను పాడ రేల
మనసార హరిసేవలను సలుప రేల
వినతాసుతవాహనుని పొగడ రేల
జనులార యివి చాలు ననుకొన రేల
ఇనకులపతి హరియనుచు తెలియ రేల
దినమెల్ల శ్రీరామ యని పలుక రేల
వనజాక్షు నపవర్గమును వేడ రేల
జనులార యివి చాలు ననుకొన రేల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.