తఱిగి దశకంఠుని తలలన్నినియు వేగ
తఱలి వచ్చినాడు పురికి దశరథసుతుడు
తఱలి వచ్చినాడు పురికి దశరథసుతుడు
జగదంబ సీతతోడ చయ్యన పుష్పకముపై
గగనమార్గమున మన ఘనశ్యాముడు
అగణితసంఖ్యలో నందరు కపివరులతో
జగదీశుడు రాముడు చనుదెంచెను
గగనమార్గమున మన ఘనశ్యాముడు
అగణితసంఖ్యలో నందరు కపివరులతో
జగదీశుడు రాముడు చనుదెంచెను
వాడవాడల రామప్రతాపౌన్యత్యమే
వేడుకగ జనులెల్ల నేడు పొగడగ
వాడవాడల సాధ్వి పావనచారిత్ర్యమే
వేడుకగ జనులెల్ల వినుతించగ
నేడు గద్దెకెక్కును నీలమేఘశ్యాముడు
వేడుకను మనమును వీక్షించుదమా
కూడి సీతమ్మ నాగోవిందు డుండగా
చూడ వేయికనులును నేడు చాలునా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.