8, ఫిబ్రవరి 2024, గురువారం

మీరు నమ్ముకొన్నవాడు


మీరు నమ్ముకొన్నవాడు మీకు సత్యము

మారాముడు మాత్రము మాకు సత్యము


కొత్త కొత్త మతము లన నుత్తుత్తి సత్యము

కొత్త కొత్త దేవుళ్ళట కూటసత్యము

హత్తిన మీదురాశ మాత్ర మసలు సత్యము

ఎత్తరాని జన్మలు మీరెత్తుట సత్యము


హరియే శ్రీరాముడనుట పరమ సత్యము

హరిని కాదనిన చెడుదు రనుట సత్యము

హరియే యపవర్గదాత యన్నది సత్యము

హరిభక్తుడు మరల పుట్టడన్నది సత్యము