5, ఫిబ్రవరి 2024, సోమవారం

నిన్నే నమ్ముకొన్నవాడరా


నిన్నే నమ్ముకొన్నవాడరా నీరేజనయన
నన్ను మరచియున్న నెట్లురా

భవసాగరపతితు నను పాహియనుచు నరచువాని
పవలురేలు రక్షించెడు వాడవనుచు మనసున

పవమానసుతసన్నుత పరవశించి నీనామము
దివారాత్రములు పలుకు దీనుని రక్షింవతువని

కరివరద దైత్యసుతావరద ద్రుపదసుతావరద
నిరుపమాన కరుణానిథి నిశ్చయముగ బ్రోతువని

సురనాయక నరనాయక శుభద సీతానాయక
వరదాయక రామచంద్ర వదలక రక్షింతువని

సిరులగోరి కాక నిన్ను చిత్తశుధ్ధితో కొలుచుచు
పరమాప్తుడ నన్నెన్నడు వదలక రక్షింతువని

హరే రామ యనిన చాలు హరే కృష్ణ యనిన చాలు
పరాత్పరా మోక్షమిత్తునురా నరా యందు వనుచు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.