నరుని మనసు నెఱుగడా నారాయణుడు
కరుణ జూపకుండునా పరమాత్ముడు
బహుజన్మల నెత్తుచును భవసాగర మీదలేక
బహువిధముల చాల కష్టపడు చుండగ
నహరహమును శ్రీహరీ ఆదుకొను మనుచుండగ
బహుకృపాళువైన విశ్వపతి యెఱుగడా
హరేరామ రక్షరక్ష యనుచుండగ ననిశమును
హరేకృష్ణ రక్షరక్ష యనుచుండగ
భరింపగను రాని భవబాధ పడుచుండగను
పరాత్పరుడు వానిమొఱలు భావించడా
హరేకృష్ణ రక్షరక్ష యనుచుండగ
భరింపగను రాని భవబాధ పడుచుండగను
పరాత్పరుడు వానిమొఱలు భావించడా
వరాభయదాత యనుచు హరికి గొప్పపేరు కదా
నరుని కష్ట మెఱుగనట్లు నటియించునా
పరమభక్తు డీత డనుచు భావించక యుండునా
సరాసరిగ మోక్షమిచ్చి జాలిచూపడా
నరుని కష్ట మెఱుగనట్లు నటియించునా
పరమభక్తు డీత డనుచు భావించక యుండునా
సరాసరిగ మోక్షమిచ్చి జాలిచూపడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.