6, ఫిబ్రవరి 2024, మంగళవారం

రామనామదివ్యఖడ్గరాజము


రామనామదివ్యఖడ్గరాజ మున్నది అది

నా మహాశత్రువులను నరకుచున్నది


కామక్రోధాదులట కలి సేనాపతులట

దీమసముగ మనసులో తిష్టవేసేరట

రామనామఖడ్గ మిటు రాగానే వారంతా

ఏమైరో గాని వారిచ్చట కనరారు


భవలతాపాశములట పట్టి బంధించునట

ఎవరినైన విడువక బిట్టేడిపించేనట

అవి యిదే రామనామ మనే ఖడ్గమనగానే

వివిధములుగ చెదరినవి వేడుక గొల్పుచును




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు