5, ఫిబ్రవరి 2024, సోమవారం

నిజమింతే శ్రీరామభక్తుల తీరింతే



నిజమింతే శ్రీరామభక్తుల తీరింతే నిజమింతే జనులార నిశ్చయము

శ్రీరామనామము జిహ్వపై నుండిన వారేల ధనముల నాశించువారు

శ్రీరామనామము జిహ్వపై నుండిన వారేల పదవుల నాశించువారు

శ్రీరామనామము జిహ్వపై నుండిన వారేల రుచులకు నెగబడు వారు

శ్రీరామనామము జిహ్వపై నుండిన వారేల భోగాశలకు లొంగువారు

శ్రీరామనామము జిహ్వపై నుండిన వారేల నన్యుల గొలిచెడువారు

శ్రీరామనామము జిహ్వపై నుండిన వారేల నిడుముల క్రుందెడువారు

శ్రీరామనామము జిహ్వపై నుండిన వారేల వాదంబులను జొచ్చువారు

శ్రీరామనామము జిహ్వపై నుండిన వారేల నజ్ఞానులై యుండువారు

శ్రీరామనామము జిహ్వపై నుండిన వారేల సర్వార్ధములు పొందరు

శ్రీరామనామము జిహ్వపై నుండిన వారేల బ్రహ్మానుభవ మందరు

శ్రీరామనామము జిహ్వపై నుండిన వారేల భవముల నొందెడువారు

శ్రీరామనామము జిహ్వపై నుండిన వారేల యమునకు భయపడువారు