7, ఫిబ్రవరి 2024, బుధవారం

పట్టాభిరామయ్య పలుకవేమయ్యా


పట్టాభిరామయ్య పలుకవేమయ్యా
ఇట్టలైన మనకు నెయ్య మెట్టులయ్యా

వాసిగ నాహృదయసింహాసనమున నుండు మన్న
దాసునకు మారాడక దయచూపక బిగిసినావు
భాసురముగ నినకులమున కౌసల్యాగర్భమందు
దాసపోషకుడవగుచును దయతో జన్మించితివే

సవినయముగ రామచంద్ర జ్ఞానగమ్య పురుషోత్తమ
అవధరించి విన్నపముల నపవర్గము నీయుమన్ప
చెవిబెట్టవు నామాటలు చింతదీర్చ కదలి రావు
ఇవల కవల కెంతకాల మిట్లు తిరుగుమందు వయ్య

కరిరాజు మొఱవింటివి సురరాజు మొఱవింటివి
హరిరాజు మొఱవింటీవి మరియును నామొఱవినవు
కరుణాలవాలుడవను  ఘనమైన సత్కీర్తి గల
హరి నీకిది పాడిగాదు మరియాదాపురుషోత్తమ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.