ఆత్రపడుచు నీ వన్నివేళలను హరినాముమునే పలుకవయా
బంధుమిత్రులను కూడియాడుచును భగవన్నామము వదలకయా
బంధుమిత్రులను భగవత్కృపచే బడిసితివన్నది మరువకయా
అది యిది కోరుచు నవనిని దిరుగుచు హరినామంబును వదలకయా
అదను జూచి నీ కన్నియు నిచ్చును హరికృపయే నని మరువకయా
ఆలితోడ ముచ్చటల దేలుచును హరినామంబును వదలకయా
అలియైన సంతానమైన నా హరికృపయే నని మరువకయా
పరులపైన పెత్తనము చేయుచును హరినామంబును మరువకయా
హరికృపవలననె ప్రభుత యబ్బెనను నసలు సంగతిని తెలియవయా
సిరిసంపదలకు తబ్బిబ్బగుచును హరినామంబును మరువకయా
సిరిసింపదలను నీకిచ్చినదా హరికృపయే నని మరువకయా
పరులతోడ సంభాషణ జిక్కుకొని హరినామంబును మరువకయా
పరులు గారవము జూపిపల్కుటది హరికృపయే నని మరువకయా
దరచుగ పంచమలంబుల జిక్కి హరినామంబును వదలకయా
హరినామం బనునిత్యము పలికిన నపవర్గంబని తెలియవయా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.