8, ఫిబ్రవరి 2024, గురువారం

హరేరామ హరేరామ రామహరేరామ హరేరామ రామ
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ

హరేరామ యందును 
  హరేకృష్ణ యందును
మరేమైన యనుటకు 
  మనసు రాకుండును

హరిని తలచుచుందును
  హరిని కొలుచుచుందును
హరిని క్షణము మరచుట
  తరమా నాకందును

హరియె సర్వమందును
  హరియె లోకమందును
హరి కన్యము కలదన  
  తరమా నాకందును