8, ఆగస్టు 2023, మంగళవారం

రాముని నమ్మిన వాడనురా

రాముని నమ్మిన వాడనురా నేనేమని యితరుల పొగడుదురా
శ్రీమన్నారాయణుడగు శ్రీరాముని చింతన మఱగిన వాడనురా

దేహధారులకు భువిలో దివిలో దిక్కైనిలచే ప్రభువనుచు
మోహనాశకుడు మోక్షకారకుడు మునిజనమోహను డితడనుచు
బాహుపరాక్రమనిర్జితానిమిషవైరివీరగణవిభు డనుచు
ఓహో బహుజన్మంబులుగా తన పదయుగ్మంబులనే యెన్నుచును

తన శుభగుణవర్ణనము చేయుటే తద్దయు సుఖమని లోనెఱిగి
తన శుభచరితమె  త్రిభువనంబుల పరమపావనం బనియెఱిగి
తన భక్తాళికి యెల్లవేళలను తధ్యము రక్షణ మని యెఱిగి
తన శుభనామమె యందరకును భవతారకనామం బని యెఱిగి 

  

2 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ధన్యవాదాలు లక్కరాజు వారూ. రామకీర్తనలను ఆదరిస్తున్నందుకూ ఈకీర్తనపై మీస్పందనకూ అనేక ధన్యవాదాలు.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.