ఏమని నిను పొగడుదునే రామపాదమా నిన్నెంతగ నేపొగడుదునే రామపాదమా
సుంత సోక ఒక రాతిని రామపాదమా నీవు సుదతిగనే చేసితివే రామపాదమా
ఎంత పని చేసితివే రామపాదమా నీ వెంత వింత చేసితివే రామపాదమా
సాకేతపురమేలెడు రామపాదమా సకలలోకముల నేలునట్టి రామపాదమా
నీకు సాటి లేదు కదా రామపాదమా నేను నీకు మ్రొక్కుచుందునే రామపాదమా
లోకమాత భూమిసుతయె రామపాదమా వంగి నీకు మ్రొక్కుచుండునే రామపాదమా
శ్రీకరమై చెలగుచుండు రామపాదమా నిన్ను చేరు భాగ్య మెపుడు నాకు రామపాదమా
మునిమోక్షకారకమగు రామపాదమా నీవు మునుకొని నను బ్రోవవలె రామపాదమా
జనుల భవబంధములు రామపాదమా నిన్ను గనినంత నశించునే రామపాదమా
రామపాదమా శ్రీరామపాదమా నిన్ను ప్రార్ధించిన వారలిక రామపాదమా
భూమిపైన పుట్టరట రామపాదమా యోగిపుంగవులారాధించు రామపాదమా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.