ఈరోజున విన్నకోట నరసింహారావు గారు స్మరణ బ్లాగులో అడిగిన ప్రశ్నకు నాకు తెలిసినంతవరకు సమాధానం వ్రాస్తున్నాను.
అన్నట్లు నరసింహారావు గారు ఆప్రశ్నను నాకు వాట్సాప్ ద్వారా కూడా పంపించారు.
మంచి ప్రశ్న వేసినందుకు ఆయనకు నా ధన్యవాదాలు.
మహోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో ఉంది సమాధానం,
అందులోని ఈ మంత్రాన్ని చిత్తగించండి.
అయం బంధు రయం నేతి గణనా లఘుచేతసామ్ ।
ఉదారచరితానాం తు వసుధైవ కుటుమ్బకమ్ ॥ ౭౧॥
ఈ మంత్రం మహోపనిషత్తులో ఆరవ అధ్యాయంలోని 71వ శ్లోకంగా ఉంది. ఉపనిషత్తు కాబట్టి మంత్రం అనాలి ఛందస్సు ప్రకారం ఇది అనుష్టుప్పు. ఒక శ్లోకం.
ఇక్కడ వసుధైవ కుటుంబకమ్ అన్నపాఠం ఉంది. వసుధైక కుటుంబకమ్ అన్న పాఠం కూడా ప్రచారంలో ఉంది. ఈపాఠం కూడా ఛందస్సుకు చక్కగా సరిపోతున్నది. అర్ధంలోనూ కించిత్తు బేధం కూడా లేదు. కాబట్టి ఏపాఠం ఐనా ఆమోదయోగ్యమే.
ఈ మంత్రం చెబుతున్న విషయం చాలా ఉదాత్తంగా ఉంది. చిత్తగించండి. వీడు నావాడు నాబంధువు - వాడు పరాయివాడు వంటి భావన అల్పబుధ్ధి కలవారు చేసేది. ఉదారమైన మనస్సు కల సజ్జనులకు ప్రపంచం అంతా ఒకే కుటుంబం. ఇదీ ఈమంత్రం చెప్పే మాట.
ఐతే ఎలా వచ్చిందో ప్రచారంలోనికి వసుధైక కుటుంబం ప్రయోగం స్పష్టంగా తెలియదు. కాని అది పొరపాటు వాడుక. ఆ ప్రయోగం అనుష్టుప్పును భంగపరుస్తున్నది. ఆమోదయోగ్యం కాదు. ఉపనిషత్పాఠం స్పష్టంగానే ఉంది.
ఈ మహోపనిషత్తును చదువదలచుకొన్న వారికి ఇది ఇంటర్నెట్లో సులభంగానే లభిస్తున్నది. దిగుమతి చేసుకోదలచుకున్న వారు https://sanskritdocuments.org/doc_upanishhat/maha-te.pdf అన్న లింక్ ద్వారా సేకరించుకోవచ్చును. పాఠం తెలుగులిపిలోనే ఉంది. ఐతే అంతా మూలపాఠమే కాని వ్యాఖ్యానం ఏమీ అక్కడ లేదు.
ధన్యవాదాలు శ్యామలరావు గారు 🙏.
రిప్లయితొలగించండివిన్నకోట నరసింహా రావు గారు,
తొలగించండినమస్తే!
కొన్ని బ్లాగులతో పాటు మీ వ్యాఖ్యలు తరచుగా చదువుతుంటాను. సందర్భోచితంగా స్పందిస్తుంటారు. మీ వ్యాఖ్యలు సరళంగా ఆ టపాపై పూర్తి అవగాహనతో ఉంటాయి. ఆదరణగా, ప్రోత్సాహవంతంగా ఉంటాయి. ప్రశ్నించడంలో ప్రజ్ఞ. సలహాలు (సలహాలు ఇవ్వడం అరుదు. ఒకటి రెండుసార్లే గమనించాను) ఇవ్వడంలో స్నేహత్వమే ఉంటుంది. ఎంతో హుందా అయిన శైలి.
ఇప్పటి ఈ మీ ప్రశ్నతో నాకూ సందేహ నివృత్తి అయింది. మీకు మనసార ధన్యవాదాలండి.
మీ అభిమానం, అంతే 🙏.
తొలగించండిధన్యవాదాలు, భారతి గారు.
- ఈపాఠం కూడా ఛందస్సుకు చక్కగా సరిపోతున్నది.
రిప్లయితొలగించండి- ఆ ప్రయోగం అనుష్టుప్పును భంగపరుస్తున్నది
ఈ రెండింటికి సమన్వయము తెలుపగలరు.
ఇట్లు
జిలేబి
తెలుపగలను. కొంచెం వేచియుండగలరు.
తొలగించండిఈశ్యామలీయం బ్లాగులో వివరణ వ్రాసాను. గమనించగలరు.
తొలగించండిచక్కటి వివరణ. ధన్యవాదాలు సర్
రిప్లయితొలగించండివసుధైక కుటుంబం అన్న పదం తెలుగు భాషలో ఉపయోగం లో ఉంది. అది సరైనదే. కుటుంబకం నుంచి కుటుంబం పదం వచ్చింది.
రిప్లయితొలగించండిపొరపాటు అభిప్రాయం.
తొలగించండివసుధ, ఏక, కుటుంబం అన్నీ సంస్కృత శబ్దాలే తెలుగెలాగైందో!
రిప్లయితొలగించండివసుధ, ఏక, కుటుంబం అన్నీ సంస్కృత శబ్దాలే తెలుగెలాగైందో!
రిప్లయితొలగించండి