3, ఫిబ్రవరి 2021, బుధవారం

రఘువీరాష్టకం

రామా జయజయ రఘువీరా కామిత వరదా రఘువీరా
భీమపరాక్రమ రఘువీరా ప్రియదర్శన హరి రఘువీరా

చిన్మయ మునిహృత్సంచారా సీతానాథా రఘువీరా
మన్మథకోటిసమాకారా మానవనాయక రఘువీరా

నిగమాగమఘనసంచారా నీరజనయనా రఘువీరా
అగణితగుణపారావారా అమితదయాపర రఘువీరా

సమరవిజయవీరాకారా సాధుగణాశ్రయ రఘువీరా
కుమతినివారణహుంకారా కువలయపాలక రఘువీరా

సేవకజనగణమందారా రావణసంహర రఘువీరా
పావనదివ్యశుభాకారా పాపవిదారా రఘువీరా

భవవిషవన నిశితకుఠారా  పరమోదారా రఘువీరా
రవికులతిమిచంద్రాకారా రాజలలామా రఘువీరా

మునిమోక్షవితరణోదారా మోహనివారా రఘువీరా
వనమాలాధరగంభీరా పరమపురుష హరి రఘువీరా

ఘనసునిశితశరసంచారా ధనుష్మదగ్రణి రఘువీరా
అనుపమసధ్ధర్మవిచారా అమలచరిత్రా రఘువీరా


2 కామెంట్‌లు:

  1. చాలా హృద్యముగా ఉంది.రోజూ చదువుకుంటే
    రాముని కృప దొరుకుతుంది.బాగా వ్రాసావు

    రిప్లయితొలగించండి
  2. రఘు వీరాష్టకం చాలా బాగుంది. నిత్య పూజలో భాగంగా రోజూ చదువుకోవచ్చును అద్బుతం గా రాశారు

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.