2, ఫిబ్రవరి 2021, మంగళవారం

వినిపించరె శ్రీరాముని కథలను

వినిపించరె శ్రీరాముని కథలను వీనులవిందుగను - భళాభళి

నినదించరె  శ్రీరామజయమ్మని నింగి మారుమ్రోగ - భళాభళిపవలని రేలని బేధములేక పల్లెపట్టులను పట్ఠణమ్ములను

వివిధప్రదేశంబులను జనులు వేలాదిగ నత్యుత్సాహమున

నవధరించగ నానందించగ నమితభక్తితో నమితశ్రధ్ధతో

సవరించి మీగొంతులు తీయగ చక్కగ మృదుమధురోక్తుల తోడను


దాసభావమున వాయునందనుడు దశరథసూనుని గొలిచిన విధమును

కోసలేయునకు లక్ష్మణస్వామి గొప్పగ సేవలు చేసిన విధమును

భూసురగృహముల రాజగృహంబుల పొలుపుగ రచ్చ బండల పైనను

భాసురకీర్తివిశాలుని రాముని పరమాద్భుతం మగు చరితామృతమును


హరునిచాప మది జనకుని సభలో హరికరంబులను విరిగిన కథను

హరి చేతులలో పరశురాముడు పరాభూతుడై పరువిడు కథను

సురవిరోధి దశకంఠుని తలలను దురమున రాముడు తరిగిన కథను

విరించిరుద్రాదులు శ్రీరాముని పరిపరివిధముల పొగడిన కథను


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.