28, ఫిబ్రవరి 2021, ఆదివారం

వందన మో హరి

వందన మో హరి వందనము జగ

ద్వందిత చరణా వందనము


వాసుదేవ హరి వందనము వాసవాదినుత వందనము

దాసపోషక వందనము దశరథనందన వందనము

భాసు‌రకీర్తీ వందనము పావనచరిత వందనము

కోసలేశ్వర వందనము కోదండపాణి వందనము


నరపతిశేఖర వందనము నళినదళేక్షణ వందనము

నిరుపమగుణనిథి వందనము నిర్భరతేజ వందనము

పరమసులభ హరి వందనము భక్తవత్సల వందనము

ధరాత్మజావర వందనము దానవమర్దన వందనము


కామారిప్రియ వందనము సామీరిప్రియ వందనము

కోమలగాత్ర వందనము కువలయేశ్వర వందనము

కామితవరద వందనము కారుణ్యాలయ వందనము

రామరామ హరి వందనము రాజీవానన వందనము


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.