23, ఫిబ్రవరి 2021, మంగళవారం

ఏమందు నేమందును

ఏమందు నేమందు నింకే మందును

రామయ్యా చెప్పవయ్య ప్రాణనాథ


నిదురంటే నేను నిన్ను వదలి యుండు టంటే

నిదురయే వలదందును నిశ్చయంబుగా


పనులంటే నిన్ను మరచి పరువులెత్తు టంటే

పనులేవీ చేయనందు పరమాత్ముడా


చదువంటే నీఘనతను చాటలేనిదైతే

చదువెందుకు వలదందును సర్వేశ్వరా


అన్నమునకు నీ వన్యుల నర్ధించు మంటే

అన్నమెందుకు వలదు పొమ్మందు నయ్యా


ఇతర దేవతలు వరము లిత్తుమురా యంటే

మతి లేదా హరిభక్తుడ మరలు డందును


పురాకృతము వలననే పుట్టినా వీవంటే

హరిసేవ కొఱకు పుట్టితి నంతే యందును


హరిగొప్పా శివుడుగొప్పా యనెడు వారితో

హరిహరులకు బేధ మేమి యెఱుగ నందును