5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

హరినామము లాలకించు టానందము

హరినామము లాలకించు టానందము
హరినామము లాలపించు టానందము

కనుల హరిని జూచుటే ఘనమైన ఆనందము
మనసున హరి నెన్నుటే మహదానందము
వనజాక్షుడు మసలిన పావనస్థలములను
తనివారగ తిరుగుటయే మన కానందము

హరిభక్తశిఖామణుల నరయుటే ఆనందము
హరిభక్తుల నుడులు వినుట అమితానందము
హరిభక్తుల మసలుచుండు నట్టి తావులయందు
మురియుచును తిరుగుటయే పరమానందము

రామతారకమునందు రక్తికల్గుటానందము
రామజపమువలన చెప్పరాని యానందము
రాముని దయవలన సకల భ్రమలు విడచి మనము
రాముని దరిచేరుటయే బ్ర్హహ్మానందము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.