14, ఫిబ్రవరి 2021, ఆదివారం

అతులితైశ్వర్యంబు

అతులితైశ్వర్యంబు నడిగితినా రామ

నుతియించి తృప్తిచెందితి నంతేగా


అడిగిన వన్నీ యిచ్చి యాదరించే వేమి

అడుగవలయును నిన్నే నాత్మేశా

కడు పిన్న వయసు నుండి కాదనక నామంచి

చెడులు నీవు చూచే వింకే మడిగితిని


ప్రతిదినంబును పొగడు వాడను కానోయి

ప్రతిక్షణంబును పొగడు వాడనయా

నుతియిప నిన్ను తగుమతిమంతు జేసితివి

అతిశయించి నిన్నే మిక నడిగితిని


నీకరుణ యొకటే నాకు నిండైన సంపద

చేకొన వేరొండు కలిమి నాకేలా

నాకింత భాగ్య మిచ్చినా వదియే చాలు

నే కొఱత యున్నదనుచు నెంచితిని