13, ఫిబ్రవరి 2021, శనివారం

పరాత్పరా జయ పురాణపురుష

పరాత్పరా జయ పురాణపురుష పతితపావన నమోనమో
హరి లోకోధ్బవస్థితిలయకారణ పరమేశ్వర తే నమోనమో

హరి త్రయీపరిరక్షణనిపుణ అసురనిషూదన నమోనమో
పరమాద్భుత ఘనమత్సాకృతి తే కరుణాసాగర నమోనమో

వరమంధరగిరిధారణనిపుణ సురగణమోదక నమోనమో
హరి పరమాద్భుత కమఠాకృతి తే కరుణాసాగర నమోనమో

సురవిరోధి హేమాక్షవిమర్దన సురుచిరవిక్రమ నమోనమో
ధరణీరక్షక వరాహరూప కరుణాసాగర నమోనమో

వరదర్పోధ్ధతసురారివిదళనభయదమహాకృతి నమోనమో
నిరుపమ నరహరి స్వరూప శ్రీహరి కరుణాసాగర నమోనమో

సురగణదుఃఖవిశోషణకార్యాతురవటుసురూప నమోనమో
హరి బలిదర్పాంతక వామన తే కరుణాసాగర నమోనమో

పరమాగ్రహపరిపూరితవిగ్రహ భార్గవరామ నమోనమో
పరశ్వథాయుధ క్షత్రియహర తే కరుణాసాగర నమోనమో

శరనిధిబంధన నిర్జితరావణ సత్యపరాక్రమ నమోనమో
ధరాసుతావర రామచంద్ర తే కరుణాసాగర నమోనమో

కరాంగుళిధృతధరాధరహరి కౌరవాంతక నమోనమో
మురళీధర సురవైరిగణాంతక కరుణాసాగర నమోనమో

అసురపురంధ్రీమనసిజరూప హరి బుధ్ధాకృతి నమోనమో
నిరుపమమాయానిర్జితదానవ కరుణాసాగర నమోనమో

విలసద్విష్ణుయశఃకులపావన వీరాగ్రణి తే నమోనమో
కలి విధ్వంసక కల్కిస్వరూప కరుణాసాగర నమోనమో