18, ఫిబ్రవరి 2021, గురువారం

ఏలుదొర ఏలర

ఏలుదొర యేలర నన్నేలర జాగేలర

మేలుమేలు నీయానతి మీఱకుందు కదర


పాలకడలిపైన శేషశాయివై కొలువుండి

లీలగా త్రిభువనంబుల నేలుచుండు సామి

నీలమేఘశ్యామ సురానీక నిత్యసన్నుత

ఆలకించి నావిన్నప మాదరించ రారా


సాకేతమునను సింహాసనముపై కొలువుండి

లోకత్రయ మేలుచుండు కాకుత్స్థ రామ

శ్రీకర కరుణాలవాల చింతితార్ధఫలద

నాకేలను ప్రసన్నుడవు కాకుందువు రారా


సకవయోగిరాజహృదయసదనమ్ముల కొలువుండి

సకలవిధములను రక్షసలుపుచుండు సామి

అకట నేను నీకు భార మైతినా యీనాడు

చకచక రారా మంచి సమయమిదే రారా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.