12, ఫిబ్రవరి 2021, శుక్రవారం

రాముని స్మరింంచవే

రాముని స్మరించవే మనసా రాముని స్మరించవే

పామరత్వమున పడక సీతారాముని స్మరించవే


కయ్యములాడే జనులమాటలకు కలగనేటికే మనసా

నెయ్యము చుట్ఝము సీతారాముడె నిజము తెలియవే మనసా

కుయ్యాలించెడు రాముని విడిచి కూళల జేరక మనసా

ఇయ్యకొనవె  శ్రీరఘుపతికే నీ వియ్యవె సర్వము మనసా


ధరాసుతాపతి కెవ్వని సాటిగ తలపోయుదువే‌ మనసా

పరాత్మరుడు రఘురాముడు నీవు పొరబడబోకే‌ మనసా

పరాకుపడకే కుజనుల గొలిచిన భంగపడెదవే‌ మనసా

నిరంతరము హరి నెన్ని కొలిచెతే నీకు శుభంబగు మనసా


ఊరి జనులతో కయ్యములాడుచు నుండగరాదే మనసా

శ్రీరఘురాముడె గురుడు దైవమని చింతించగదే మనసా

తారకనామము స్మరించకుంటే తరించుటెటులే మనసా

శ్రీరామా శ్రీరామా యంటే సిధ్ధము మోక్షము మనసా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.