22, ఫిబ్రవరి 2021, సోమవారం

శ్రీకరమై శుభకరమై

శ్రీకరమై శుభకరమై శ్రీరామనామము

లోకముల నేలుచుండు గాక చక్కగ


ఎంత కాల మాకాశ మీయుర్వియు నుండునో

ఎంత కాల ముందురో యినుడు చంద్రుడు

ఎంత కాల మీసృష్టి యీశ్వరాజ్ఞ నుండునో

అంత కాల ముండు గాక అతిశయంబుగ


ఎంత కాల ముర్విపై నీజలధులు వనములును

జంతుతతియు నుండునో యంతకాలము

నెంత కాల మా శేషుడు నీవసుధను మోయనో

యంత కాలముండు గాక సంతోషముగ


ఇంత కాల మని యేమి యీశ్వరుని సత్కీర్తికి

ఇంత కాల మని యేమి యీశ్వరునకును

ఇంత కాల మని యేమి యీరామ భజనమునకు

సంతతము వెలుగు గాక సజ్జనేప్సితమై


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.