20, ఫిబ్రవరి 2021, శనివారం

ఓ రసనా పలుకవే

ఓ రసనా పలుకవే శ్రీరామ మంత్రమే

ఈరేడు లోకాల నేలు మంత్రమే


ఇంత గొప్ప మంత్రమే యిలలోన లేదందుదు

ఇంతింతనరాని చవుల నెసగుచుండు నందురు

సంతోషముగ శివుడే సదానిలుపు రసనపై

అంతకంటె నుత్తమం బగున దేముండు


ముక్కు క్రింది గోతిలో ముచ్చటగ కూరుచుండి

అక్కర లేనట్టి కబురు లాడుచున్న ఫలమేమి

చక్కగా నీవు రామచంద్రుని శుభనామ

మెక్కుడుగా చవిగొనుచు నిక్కరాదటే


హేయము లశాశ్వతముల నేమిరుచులున్నవే

హాయిగా శ్రీరామనామామృతమే గ్రోలవే

మాయమైపోవు లోన మంచిరుచిని గ్రోలవే

వేయేల పలుక కింక వెఱ్ఱిమాటలే