4, ఫిబ్రవరి 2021, గురువారం

శ్రీరామనామభజన

శ్రీరామనామభజన చేయండి సుజనులారా

నోరార రామ యంటే శ్రీరామరక్ష కలుగు


శ్రీరామరక్ష కన్న మీరేమి కోరగలరు

శ్రీరామరక్ష కన్న వేరొండు గొప్ప రక్ష

వేరెవ్వ రీయగలరు వేయేల రాము డొకడె

మీ రాశ్రయించదగిన కారుణ్యమూర్తి కనుక


శ్రీరామరక్ష కలిగి మీరుందురేని మిమ్ము

వేరెవ్వరేని జెనక లేరండి నిశ్చయముగ

భూరిప్రతాపశాలి శ్రీరామవిభుని రక్ష

మీరెల్ల పొందగలరు చేరండి విభునివెనుక


శ్రీరామరక్ష గూర్చి సీతమ్మతల్లి సాక్షి

శ్రీరామరక్ష గూర్చి శ్రీవిభీషణ సా

మీరి సుగ్రీవులనే మీరడుగవచ్చు నండి

ఈరేడు లోకములను పేరెక్కె దాని ఘనత


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.