15, ఫిబ్రవరి 2021, సోమవారం

శ్రీరామనామము

శ్రీరామనామము మన సీతారాముని నామము

మీరు తప్పక చేయండి శ్రీరామనామము


చిత్తజగురు నామమైన శ్రీరామనామము

చిత్తశాంతి కలిగించును శ్రీరామనామము

చిత్తమునకు ప్రీతికరము శ్రీరామనామము

చిత్తుచేయు బంధములను శ్రీరామనామము


క్రూరులను శిక్షించును శ్రీరామనామము

ధీరత్వము కలిగించును శ్రీరామనామము

ఘోరాపద లణగించును శ్రీరామనామము

తీరుగ మిము రక్షించును శ్రీరామనామము


నారకభయవారకమీ శ్రీరామనామము

చేరదీసి దారిచూపు శ్రీరామనామము

ఆరాటము లణగించును శ్రీరామనామము

తీరమునకు మిము జేర్చును శ్రీరామనామము