14, ఫిబ్రవరి 2021, ఆదివారం

జయజయ రామచంద్ర

జయజయ రామచంద్ర సమయము మించేను
శయనమందిరమున జానకి వేచేను

వచ్చి విన్నవించినారు వార్తలు చెప్పువారు
ముచ్చటలు మంత్రులతో ముగిసినవి
అచ్చట మాజానకీ అమ్మగారితోడ నీవు
ముచ్చటలాడగ రావే ముదమార

పనిగొని నిన్నీ రీతిగ భక్తులు పొగడుచుండ
వినుచు నీవు కూర్చుంటివి వీరి కేమి
మన స్వామి నిదురవేళ యని తలచుటయే లేదే
వినివిని యలసినా విక విచ్చేయవే

నిదుర చాలు చాలకుండు నిను మేలుకొలుపుదు
రదనెఱిగి వైతాళికు లంతలోనె
ముదితతో కొన్ని ముద్దుముచ్చట లన్నవి లేవో
కదలవయ్య రాత్రిచాల గడచె నదే