10, ఫిబ్రవరి 2021, బుధవారం

గోవింద రాం రాం

గోవింద రాం రాం గోపాల హరిహరి
నీవాడ రక్షించ రావయ్య శ్రీరామ

పాలసంద్రము మీద ప్రక్కవేసిన స్వామి
శ్రీలక్షి నీపాదసేవ చేయుచునుండ
లీలగ లోకాల నేలుచుందువు నీవు
నీలీల లెన్నగ నే నెంతవాడను

భక్తులందరు చేరి పరవశమందుచు
శక్తి కొలది నిన్ను ప్రస్తుతించుచునుండ
ముక్తి నొసగుచు వారి బ్రోచుచుందువు నీవు
భక్తినొసగి నన్ను ముక్తుని జేయవె

కరినంబరీషుని కాచిన శ్రీహరి
కరుణామయుడ వన్ను కనికరించవయ్య
పరమాత్మ నీయందు గురియున్న వాడను
సరగున రావయ్య శరణంటిని నీకు