24, ఫిబ్రవరి 2021, బుధవారం

ఇంతకు మించి

ఇంతకు మించి ఏమి చెప్పేది ఇంతే నాకు తెలిసినది

అంతా రామమయమీ జగ మంతా రామమయము


రామా రామా అన్నావా రాముడు చేరువ అయ్యేను

రాముని నమ్మి యున్నావా రాముడు నీకై నిలిచేను

రాముని ప్రేమగ కొలిచావా రాముడు ప్రేమ చూపేను

రామా శరణం అన్నావా రాముని రక్షణ కలిగేను


రాముని చరితము చదివావా కామితంబు లీడేరేను

రాముని కీర్తిని నుడివావా భూమిని కీర్తి నిలిచేను

రాముని నామము చేసావా రాముని దయ నీ కబ్బేను

రాముని ధ్యానము చేసావా బ్రహ్మానందము కలగేను


రామతీర్ధములు తిరిగేవా రాముడు నిన్ను మెచ్ఛేను

రామభక్తులను చేరావా రామతత్త్వ మెఱుకయ్యేను

రామతత్త్వ మెఱుకయ్యేనా రాముని వాడ వయ్యేవు

రాముని వాడ వయ్యావా రాముని సన్నిధి చేరేవు