6, ఫిబ్రవరి 2021, శనివారం

హరిహరి నరజన్మ మిది

హరిహరి హరిహరి నరజన్మ మిది

దొరుకక దొరుకక దొరికినది


కరుణామయుడగు హరికటాక్షము

దొరకుట ఎంతో దుర్లభము

దొరుకక దొరకిన నరజన్మములో

హరికృప యెటులో దొరకినది


నరజన్మ మిది మరల దొరకునా

దొరకిన హరికృప దొరకేనా

హరేరామ యని హరేకృష్ణ యని

మరవక తలచెద హరినెపుడు


తలచెద హరిని వలచెద హరిని 

చెలిమిచేసెదను శ్రీహరితో

నళిననేత్రుడు నావాడైతే

యిల నిక జన్మము కలుగదుగా