18, ఫిబ్రవరి 2021, గురువారం

చక్కగ పాటలు పాడరే

చక్కగ పాటలు పాడరే

మక్కువతో రామునిపై


మిక్కిలి ప్రియుడగు మేదిని పతిపై

చక్కని చల్లని సామిపై

దిక్కుల నిండిన తేజము గలవా

డిక్కడ వెలసిన యినకులేశుడని


మక్కువ గొనిరట మరి మునులందరు

నెక్కడి చోద్యం‌ బిది నాక

అక్కజముగ తా నంగజగురుడే

యిక్కడ నుండిన యినకుల పతియని


చిక్కులబఱచు చెడు రక్కసులను

తుక్కచేసిన దొఱయనుచు

నెక్కటి వీరుం డీ రాఘవుడని

దిక్కులు మ్రోయగ మిక్కిలి పొగడుచు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.