27, ఫిబ్రవరి 2021, శనివారం

నీవాడనే కాని

నీవాడనే కాని పైవాడ గాను

రావయ్య వేగ రక్షింప గాను


రవిశశిలోచన రాజలలామ

కువలయపోషణ కుమతివిరామ

భవబంధమోచన పట్టాభిరామ

అవధారు దేవ అయోధ్యరామ


స్తవనీయచరిత జానకిరామ

పవమానాత్మజభావిత రామ

ధవళేక్షణ హరి దశరథరామ

నవనీతహృదయ నాతండ్రి రామ


ఇనవంశోత్తమ ఈశ్వర రామ

మునిజన మానస మోహనరామ

ధనుష్మదగ్రణి దనుజవిరామ

నను కాపాడవె నాతండ్రి రామ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.