28, ఫిబ్రవరి 2021, ఆదివారం

రామా యివియే మా విన్నపములు

రామా యివియే మా విన్నపములు రక్షించగ వేగ రావే

రామా సీతారామా తారకనామా నీవే దిక్కు 


శ్రీరఘురామా సీతారామా కారుణ్యధామా దయతో

ఘోరభవాంబుధి దాటించి మమ్ము గొబ్బున రక్షించవయ్యా

మీఱక మేము నీ నామమునే మిక్కిలి సంతోషముతో

తీరికలేదని వంకలు పెట్ఠక తిన్నగ చేసెద మయ్యా


నిరతము మేము చేసెదమయ్యా నీనామము నేమఱక

సరగున వచ్చి రక్షించవయ్యా జానకిరమణా రామా

పరమదయాళో పట్టాభిరామా పతితపావన నామా

మరి వేరు దిక్కే లేదని మేము మనసున నెఱిగితి మయ్యా


కామితవరదా కరిరాజరక్షక మామా దోసంబు లెల్ల

నేమనుకొనక యిట్టేమన్నంచి మామంచియే లోనెంచి

పామరులము మేమెల్లరము నీ పాపలమని మదినెంచి

రామచంద్ర కరుణారససాంద్ర రక్షించ రావయ్య వేగ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.