12, ఫిబ్రవరి 2021, శుక్రవారం

ముకుంద మాధవ యనరే

ముకుంద మాధవ యనరే మోక్షము చేరువ కనరే
వికారములనే విడరే శుకాదుల గతి కనరే

హరేకృష్ట యని యనరే యష్టసిధ్ధులను గొనరే
హరేరామ యని యనరే అమృతమదియే కనరే
హరిహరి హరి యని యనరే యాత్మయోగులై చనరే
హరిభక్తులరై మనరే అన్నిట హరినే‌ కనరే

హరిక్షేత్రములకు చనరే హరిగురుతులనే కనరే
హరిమహిమలనే వినరే హరిపరమాత్ముం డనరే
హరియే గురువని యనరే హరిసత్కృపనే గొనరే
హరిభక్తులరై మనరే హరికై జీవన మనరే

హరినామము ముద్దనరే హరికన్యము వద్దనరే
హరి భవతారక యనరే స్థిరకీర్తిని చేకొనరే
హరి రఘువీరా యనరే ఆ రఘునాథుని కనరే
హరిభక్తులరై మనరే హరిమయ మీ‌జగ మనరే

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.