12, ఫిబ్రవరి 2021, శుక్రవారం

జగదభిరాముని కనరండీ జానకిరాముని కనరండీ

జగదభిరాముని కనరండీ జానకిరాముని కనరండీ
జగదీశ్వరుని కనరండీ సంతోషముగా కనరండీ

కౌసల్యాసుఖవర్ధనుడైన కమలదళేక్షుని కనరండీ
దాసపోషకుని ధర్మవివర్ధను దశరథసూనుని కనరండీ
వాసిగ సాకేతాధీశుండగు పట్టాభిరాముని కనరండీ
భూసుతతో సింహాసనమెక్కిన పురుషోత్తముని కనరండీ

రావణాంతకుని రణకోవిదుని రామచంద్రుని కనరండీ
దేవతలందరు పొగడేస్వామిని దివ్యపురుషుని కనరండీ
భావాతీతప్రభావుని రాముని పరమాత్మునిదే కనదండీ
శ్రీవైదేహిని జగదంబను మన సీతమ్మ నిదే కనరండీ

కనరండీ కనరండీ భవకల్మష నాశను కనరండీ
కనరండీ జనరండీ హరికళ్యాణ మూర్తిని కనరండీ
కనరండీ కనరండీ హరవినుతుని శోభను కనరండీ
కనరండీ కనరండీ ఇక కలుగదు జన్మము నిజమండీ