5, ఏప్రిల్ 2023, బుధవారం

జయజయ శ్రీరామ జానకిరామ

జయజయ శ్రీరామ జానకిరామ 

జయజయ త్రిభువనశాసక రామ


రామ వైకుంఠపురధామ సర్వేశ

రామ సూర్యాన్వయసోమ సురవంద్య

రామ మేఘశ్యామ రాజీవనయన

రామ రూపవిజితకామాది సుందర


రామ సుగుణధామ రమణీయ నామ

రామ సాకేతసార్వభౌమ రఘువీర

రామ విరాధాదిరాక్షస నిధన

రామ దశకంథరప్రాణాపహరణ


రామ పరాక్రమరక్షిత భువన

రామ సంసారారణ్యకుఠార

రామ సద్భక్తజనకామితవరద

రామ సుజనమోక్షప్రదశుభనామ