వరద వరద నీనామము పలికెదమయ్యా నీవు
కరుణజూపి మమువేగమె కావవయ్యా
తరచుగ నీలీలలనే తలచెదమయ్యా నీ
చరితమునే నిత్యమును చదివెదమయ్యా
నిరతంబును నీసేవల నిలిచెదమయ్యా నీ
పరమభక్తవరులతోడ తిరిగెదమయ్యా
మరువక నిను కలను గూడ మసలెదమయ్యా నీ
వరగుణములు జనులమధ్య పాడెదమయ్యా
పరమకృపామూర్తివని పలికెదమయ్యా నీ
సరివారే లేరన్నది చాటెదమయ్యా
హృదయంబుల నిను నిలిపి యెసగెదమయ్యా నిను
ముదమారగ నర్చించుచు మురిసెదమయ్యా
వదలము నీపాదములను వదలమయ్యా ఓ
సదయ రామభక్తులమని చాటెదమయ్యా
అనయము మీ కీర్తనల హృదయమున తలుతుమయ్యా మేము!
రిప్లయితొలగించండిసంతోషం లలిత గారూ, ఈకీర్తనల ధ్యేయం కూడా అదే. అనయము శ్రీరాముని తలపును జనులకు కలిగించాలన్నదే. ధన్యవాదా లండీ.
తొలగించండి