మంచివాడవు రాఘవా నా
మంచిని కోరుట మానవురా
నిన్ను నేను మరచి నీనామమే విడచి
యున్న జన్మంబుల నోపికతో నుండి
తిన్నగ నినుగూర్చి తెలియు నందాకను
నన్ను ప్రబోధించి నడిపించి నట్టి
ధనములనాశించి తప్పుడు దారులం
దనిశము తిరిగిన దైన జన్మంబుల
గినియక నీభక్తి ధనమిచ్చి బ్రోచి యీ
తనువున నీసేవ దయచేసి నట్టి
నేడు కొంచెమెఱిగి నీపైన కీర్తనల
వేడుకతో చేయు విధమున దొసగులు
జూడక మన్నించి చూపుల పెదవుల
వీడని నగవుల వెదజల్లుదువు దయ
రిప్లయితొలగించండితిన్నగ నినుగూర్చి తెలియ
కున్నట్టి మనుజుని నన్ను కొంతైనను నీ
వెన్నటికి మరువక ప్రభో
వెన్నంటిన మంచివాడ వీవె రఘుపతీ!
జిలేబి