ధనకనకంబులె సర్వము తమకని తలచుచునుందురు కొందరు
వనజాక్షా నీసేవాభాగ్యము వదలలేరు మరికొందరు
రమణీమణుల సాంగత్యమునకు భ్రమపడుచుందురు కొందరు
రమారమణ నీసాంగత్యమునకు ప్రార్ధింతురు మరి కొందరు
కుమారకులు తమ నుధ్ధరించుటను కోరుచునుందురు కొందరు
కమలాక్షా నీవుధ్ధరించుటను కాంక్షింతురు మరి కొందరు
పరుల మెప్పునకు శాయశక్తులను పాటుపడుదు రిల కొందరు
పరాత్పరా హరి నీమెప్పునకై ప్రార్థింతురు మరి కొందరు
పొరిపొరి నానాదేవగణంబుల పూజించెద రిల కొందరు
పురుషోత్తమ హరి నిన్నొక్కడినే పూజింతురు మరి కొందరు
నోరుచేసుకొని దేవుడు లేడని నుడువుచు నుందురు కొందరు
శ్రీరఘురామా నిన్ను నమ్ముకొని జీవింతురు మరి కొందరు
ఊరక బహుమంత్రంబుల జదువుచు నుందురు మూర్ఖులు కొందరు
ఊరక బహుమంత్రంబుల జదువుచు నుందురు మూర్ఖులు కొందరు
తారకనామ స్మరణము చేయుచు తరియింతురు మరి కొందరు
రామకీర్తనలు వ్రాసి, చదివించి తరియింపజేయుదురు మీరొక్కరు!
రిప్లయితొలగించండిఎంతమాట. ఎందరో మహానుభావులు శ్రీరామసంకీర్తనం చేసి తెలుగునేలపై రాముడిని ఇలవేలుపుగా చేసారు అందరికీ. నేనెంత! ఐనా నా శక్తికొద్దీ నాభక్తికొద్దీ ఇలా సంకీర్తనం చేస్తున్నానంతే.
తొలగించండిఈ వ్యాఖ్య ప్రస్తుత టపా కు సంబంధించిన విషయం కాదు.
రిప్లయితొలగించండిఇటీవల పద్యాలు వ్రాస్తున్న సీనియర్ అనువాద రచయిత గారి బ్లాగులో ఇటీవలి వ్యాఖ్య చదివిన తరువాత కలిగిన అభిప్రాయం.
కృతక పద్యాలపై మీరు వ్రాసిన వ్యాఖ్య సముచితం గా ఉంది. అయితే మంచి సలహాను సద్విమర్శను ఆ రచయిత స్వీకరించ లేకపోయారు అనిపించింది. ఒకింత కటువుగా ఆ రచయిత మీ వ్యాఖ్యపై ప్రత్యుత్తరం ఇవ్వడం సరికాదు. మీరు నొచ్చుకోకండి.
అయితే అనగ అనగ రాగమతిశయిల్లుచునుండు అన్నట్టుగా ఔత్సాహిక పద్య రచయితలు ప్రయత్నించడం తప్పు లేదేమో. కొత్తగా మొదలు పెట్టిన వారి నుంచి చిక్కటి చక్కటి పద్యాలు ఆశించలేము.
ఒక్కోసారి సదుద్దేశ్యంతో ఇచ్చిన సలహాను కూడా స్వీకరించ లేరు అనిపిస్తుంది.
ఈ విషయం లో జిలేబీ నయం. తన పద్య పాషాణాలను విమర్శించినా స్పోర్టివ్ గా స్వీకరిస్తుంది.
న బ్రూయాత్ సత్యమప్రియం.
అవునండీ. అప్రియస్యచ పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః కదా.
తొలగించండిఅయినా ఎందుకండీ అడగకుండానే సలహాలు ఇచ్చి చులకన అవుతారు?
రిప్లయితొలగించండిఈ రోజుల్లో చిన్న పిల్లలకి కూడా అడగకుండా సలహాలు ఇవ్వకూడదు.
మీరన్నది నిజమండీ.
రిప్లయితొలగించండి“ అజ్ఞాత” 29 ఏప్రిల్, 2023 10:37 AMకి
రిప్లయితొలగించండిమీరు చెప్పినగా, బోనగిరి గారు చెప్పినదీ పూర్తిగా సబబే.
అసలు సంగతేమిటంటే శ్యామలీయం గారొక చాదస్తుడండీ. పద్యరచనా విషయంలో వారు అంత తేలికగా సమాధాన పడరు. ఇతరులు ఎలా వ్రాస్తే నీకెందుకయ్యా స్వామీ, వాళ్ళు మీ అభిప్రాయం కోరితే చూడచ్చు గదా అంటే వినరు. ఎదుటి వారి ప్రయత్నానికి మెరుగులు దిద్దుదామనే సదుద్దేశంతో (కానీ అయాచితంగా) వెళ్ళి ఉచిత సలహాలు ఇచ్చి … భంగపడతారు. మీరన్నట్లు "జిలేబీ” గారు sportive గా తీసుకుంటారు. అలా కాకుండా … విమర్శను graceful గానూ హుందా గానూ తీసుకోలేని వ్యక్తుల వైపు అసలు వెళ్ళద్దంటే ఈయన అర్థం చేసుకోరు (ఓ పాత సినిమాలోని "టౌను పక్కకెళ్ళొద్దురా" అన్నపాట గుర్తొస్తుంది 🙂). పద్యరచన మీద ఆయనకున్న మక్కువ అటువంటిదనుకోండి. అయినప్పటికీ కొన్ని కొన్ని చోట్ల అడుగు పెట్టరాదు. పెడితే ఇదిగో ఇలాగే జరుగుతుంది. మనం చెప్పినా మొదట సరే సరే అంటారు గానీ అటువంటి సందర్భం మళ్ళీ తారసపడితే మళ్ళీ మామూలే. నిగ్రహించుకోలేరు.
అంత పరిజ్ఞానం కలిగిన వ్యక్తి అలా భంగపడుతుంటే వారితో పరిచయమున్న మనలాంటి వారికి కష్టంగా ఉంటుంది. ఇకనైనా శ్యామలీయం గారు దృఢనిశ్చయంతో నిగ్రహించుకుంటే అందరం సంతోషిస్తాం.
విన్నకోట వారూ!
తొలగించండిప్రతి వ్యక్తిలోనూ సాత్విక రాజస తామస గుణాలు ఉంటాయి.కానీ,ఏదో ఒకటి కొంచెం ఎక్కువ ఉంటుంది.అనీ సమంగా ఉండటం అవ్యక్తంలో తప్ప వ్యక్తంలో సాధ్యం కాదు.
శ్యామలీయం మాస్టారిలో సాత్వికం ఎక్కువ.అలాగని తామస రాజసాలు శూన్యం కాదు కదా!కళ్ళముందు ఒక తప్పు జరుగుతూ ఉంటే మౌనంగా ఉండటం వల్లనే అధర్మం బలం పెంచుకుంటుంది.ఒక్క యుగం వెనకాల ద్రౌపదికి పరాభవం జరిగిన విషయంలో భగవాన్ భగవాన్ శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి కూడా తప్పు పట్టిన విషయం మీరెరుగనిది కాదు.అలాంటప్పుడు శ్యామలీయం మాస్టార్ని కూడా ద్రౌపదీ మానభంగ పర్వంలో భీష్ముని వలె ప్రవర్తించ మనడం తప్పు.వాళ్ళ స్వాతిశయాలతో తమకు ధర్మం చెప్పిన పెద్దమనిషిని అవమానిస్తే మీరు వాళ్ళని కట్టడి చెయ్యాల్సింది పోయి శ్యామలీయం మాస్టారిని అసలు తనకు తెలిసిన ధర్మం చెప్పవద్దనడం మంచి మాట కాదు.
వ్యక్తిలో వలెనే జాతిలో కూడా సాత్విక రాజస తామస గుణాలు ఉంటాయి.కానీ,ఏదో ఒకటి కొంచెం ఎక్కువ ఉంటుంది.ఎంత ఎక్కువ మనది ఏ గుణాన్ని ప్రదర్శిస్తే ఆ జాతిలో ఆ గుణం ఉన్నట్టు ఇతరులు గుర్తు పడతారు.మన జాతిలో శ్యామలీయం వంటి సాత్వికుల సంఖ్య పెరగాలంటే మనం కూడా అదే లక్షణాన్ని ప్రదర్శించాలి గానీ తన స్వధర్మాన్ని ప్రదర్శించవద్దని శ్యామలీయం మాస్టార్ని కట్టడి చెయ్యకూడదు.
జై శ్రీ రామ్!
మీరన్నదీ కరక్టే హరిబాబు గారు.
తొలగించండి'టౌను పక్క కెళ్లొద్దురో డింగరీ' అంటున్నా 'ఐననూ పోయి వచ్చెద' నంటూ భంగపడి బెంగపడే పెద్దాయనను 'ఎవరో అన్నారని అంటే అన్నారని' భుజం తడుతూ 'తీయ తీయని తేనెల మాటలతో, మీరేంటి ఇలా!
తొలగించండిఅయితే ఆయన్ను ఎప్పట్లానే అన్ని చోట్లకు పిలవని పేరంటంలా వెళుతూ దొరికే ప్రసాదాలను స్వీకరించమంటారు - అంతేగా, అంతేగా!! హరి హరీ!!
(నాణానికి వెనక - లెక్క)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅయ్యో అయ్యో ఇదెక్కడి చోద్యం శ్యామలరావు గారు? నేనన్న మాటలే నరసింహ రావు గారు, బొనగిరి గారు అంటే శబ్ద భేదమా? ఏమైనా మీరు గడుసరులు సుమా మన, తన భేదం బాగా తెలిసిన పండితులు. పైన కూడా మీ మీద గౌరవ భావం తోనే మాట్లాడాను తప్ప మరో భావన లేదు. మీరర్థం చేసుకోలేకపోయారు అనను గానీ, మీకర్ధమయ్యేట్లుగా నేను రాయలేకపోయానేమో అననుకుంటాను. My bad 😞
తొలగించండిఅజ్ఞాత4 మే, 2023 6:28 AMకి
తొలగించండిఅయితే ఆయన్ను ఎప్పట్లానే అన్ని చోట్లకు పిలవని పేరంటంలా వెళుతూ దొరికే ప్రసాదాలను స్వీకరించమంటారు - అంతేగా, అంతేగా!! హరి హరీ!!
(నాణానికి వెనక - లెక్క)
hari.S.babu
ఆ ప్రసాదాలను ఆయన స్వీకరించడం లేదని నాకు తెలుసు.ఆయన ఒక్కడే ధర్మం మాట్లాడుతున్నాడు గనకనే ఆ ఒక్కడి మీద దాడి చేస్తున్నారనే సత్యం మీకు తెలియదు."మన జాతిలో శ్యామలీయం వంటి సాత్వికుల సంఖ్య పెరగాలంటే మనం కూడా అదే లక్షణాన్ని ప్రదర్శించాలి"అని సత్యం విడమరిచిన తరవాత కూడా శ్యామలీయం మీద జాలి ఒలకబోస్తున్న మీరు ఎవరో కూడా నాకు తెలుసు.శ్యామలీయాన్నే తట్టుకోలేక పోతున్నారు,ఆయనకి బదులు నేను రంగంలోకి దిగితే ఎలా తట్టుకుంటారు?
నేను ప్రతికక్షులకి రెండు చాయిస్సులు ఎప్పుడూ ఇవ్వను.ఒకవేళ ఇస్తే ఆ రెంటిలో ఏది తీసుకున్న నాకే లాభం,ప్రతికక్షి మీరైతే మీకే నష్టం - - అంతేగా, అంతేగా!! శివ శివా!!
(వీరఖడ్గం వెనకా ముందూ చూడదు - అదీ లెక్క)
అజ్ఞాత4 మే, 2023 6:28 AMకి
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు నాస్పందన నాకే అవసరం అనిపించక తొలగించా నండి. గమనించగలరు.