12, మార్చి 2018, సోమవారం

ఆంధ్రులకు ప్రస్తుతపరిస్థితుల్లో జీవించేహక్కు లేదనీ చెప్పరాదా?



బోలెడు వాగ్దానాలు.

అబ్బో అబ్బో అనుకున్నా రంతా.

దగాపడ్డ ఆంద్రులపై ఇంతంతన రాని అభిమానం కురిపించారు.

గద్దెకెక్కారు.

ఓడ దాటాక బోడిమల్లయ్య అన్న సామెతను వినిపిస్తున్నారు.

ప్రత్యేకహోదా ఇస్తామన్నామా ?  ప్రస్తుతపరిస్థితుల్లో వీలుపడదు అన్నారు.

ఇంకా అదివీలుపడదు ఇది వీలు పడదు అంటూనే ఉన్నారు.

నిన్నో మొన్నో బీజేపీలో ఉన్న తెలుగు వాళ్ళు ఏమన్నారూ?  అన్నింటికీ కేంద్రం సానుకూలంగా ఉందీ అని కదూ!

ఛీఛీ.

24 గంటలు చచ్చి గడిచాయో లేదో ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖకు రైల్వేజోన్ ఇవ్వటం వీలు పడదూ అని తేల్చేసారు నవ్వుతూ!

మోసం చేసి చిప్పచేతిలో పెట్టాయి ఆ దిక్కుమాలిన కాంగ్రెసూ ఈ బుధ్ధిమాలిన బీజేపీనూ.

ఇంకా మోసకారి మాటలే. ఇంకా దగాకోరు చేతలే.

ఏంచేసినా ఎలాగూ ఆంద్ర్హ్లులు బీజేపీని గద్దెకెక్కించరు కదా, వీళ్ళకు ఇచ్చిన మాట నిలబెట్టికోకపోతే కొత్తగా పోయేదేమి ఉంటుందీ అనికదూ వెధవ కుళ్ళు బుధ్ధి ఈ బుధ్ధిమాలిన పార్టీకి?

అయ్యా, ఎందుకిలా రోజుకో ప్రాణాంతకమైన జోక్ పేలుస్తున్నారూ?

ఓ దుర్వారగర్వాంధ బీజేపీ  పార్టీ మహానుభావులారా!
ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రులకు బ్రతికే హక్కులేదని ఒక తీర్మానం చేసెయ్యండి.

మా ప్రాప్తం ఇంతే అనుకుంటారు.

ఇష్టం ఐతే ఇలా నిత్యక్షోభను అనుభవిస్తూ ఈ అవమానకరభారతంలో పౌరులుగా బ్రతుకీడుస్తారు.

లేదా చస్తారు - పీడా పోతుంది.

లేదా,  తెగిస్తే ఈభారతావనిలో తమభాగం తాము పంచుకొని వేరేదేశం ఏర్పాటుచేసుకుంటారు.

అదీ అంత పిచ్చిపనేమీ కాదని ఆంధ్రులు అనుకొంటే అందుకు 'ప్రస్తుతపరిస్థితులే' కారణం అని అందరూ అనుకుంటారు లెండి.

బోలెడు వనరులు కల నేల - సముద్రం ఆంద్రుల సొత్తు.

ఆ వనరుల నన్నింటినీ నిర్ధాక్షిణ్యంగా ఈ ఉత్తరదేశపిచ్చి ఉన్నవాళ్ళు దోచుకుపోతూనే ఉన్నారు - పైసా వాటా కూడా ఇవ్వకుండా. నిజానికి అన్నింటిలోనూ ముందు అధమపక్షం 50% వాటా ఇచ్చి మరీ తీసుకొని వెళ్ళమనండి చాలు.

అంతర్యుధ్ధం వస్తుందా?

అయ్యబాబోయ్ అంతపని జరుగుతుందా? ఎంత ఘోరం ఎంతఘోరం!

బీద ఆంధ్ర ఓడిపోతుందా?

పెద్దమొత్తంలో ఆంధ్రులు చస్తారా?

చావనియ్యండయ్యా, ఈ బ్రతుక్కన్నా ఆ చావే గౌరవనీయమైనది కాదా?

చావుకు తెగించలేక ఇలాగే బ్రతుకీడ్చటం కుదరక ఎలాగూ బీదరికంలో మగ్గి చావక తప్పదు కదా? అలాంటప్ప్పుడు మీ హక్కులకోసం మీరు దెబ్బలాడండి.  అందుకు చావవలసి వస్తే అందరూ ఐనా సరే నిర్మొగమాటంగా చావండి. ఏమీ తప్పులేదు!

నిన్నో మొన్నో మన సుప్రీంకోర్టువారు ఒక తీర్పునిచ్చారు. చూసారా?

ఇంక జీవించే ఆశలేని వాడు గౌరవంగా మరణించాలని కోరుకోవటం సబబే నని.

గౌరవంగా అన్నిరాష్ట్రాలతో సమానంగా జీవించే హక్కు మీకు లేదని బీజేపీ వారు ఈరోజు చెబుతున్నారు. అన్నింటికీ సున్నపుబొట్లు పెట్టి వెక్కిరిస్తూనే మేం అంత మాట అనటం లేదూ అంటారు లెండి ఎలాగూ. కాని క్రియలో 100% వాళ్ళ చేతలకు అర్థం మీరు బ్రతికినా చచ్చినా మాకు ఒకటే అని చెప్పటమే.

అయ్యో అందరమూ చస్తె ఎలాగు, ఈ భూమి ఖాళీ ఐపోదా అని బెంగపడకండి. దానిలో జెండా పాతుకుందుకు వేరే వాళ్ళకు ఆసక్తి ఉండవచ్చును లెండి. అది మీకెందుకు?  మీ అనంతరం ఏం జరిగితే మీ కెందుకు?

అందుచేత బ్రతకాలో చావాలో ఇంకా నాన్చకుండా  తేల్చి చెప్పమనండి ముందు. ఎలాగూ మిమ్మల్ని చచ్చిన వాళ్ళ క్రిందో అంతకన్నా హీనంగానో చూస్తున్నారన్నది తెలుస్తూనే ఉన్నా, ఆ ముక్క బయటపడి చెబితే ఆ రువాత మీ ఆలోచన మీరు చేసుకుందుకు వీలుగా ఉంటుంది. ముసుగులో గ్రుద్దులాట లెందుకు అసహ్యంగా!

అయ్యా బీజేపీ వారూ, ఆముక్కేదో చెప్పేద్దురూ మీకు పుణ్యం ఉంటుంది!


23 కామెంట్‌లు:

  1. మీతో ఏకీభవిస్తున్నాను.ఈ పాపఫలితం అనుభవించకపోరు భాజపేయులు.
    త్రిభిర్వషై స్త్రిభిర్మాసై స్త్రిభిర్పక్షై స్త్రిభిర్దినై
    రత్యుత్కటైః పాప పుణ్యై రిహైవ ఫలమశ్నుతే౹౹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాపులు పాపఫలాన్ని అనుభవిస్తారన్నది నిర్వివాదం.

      కాని పాపుల పాపఫలాన్ని వారి వెంట ఉన్న వారందరూ అనుభవిస్తారు, అందులో కొందరు నిర్దోషులైనా విడిగా చూస్తే.

      అలాగే ఆ పాపులు పాపఫలానుభవం పొందేలోగా పుణ్యాత్ములనేకులు చావక తప్పదు కూడా.

      అన్నింటికీ కాలం సమాధానం చెబుతుంది. అతిపాపానికి కొంచెంతీవ్రంగా తొందరగానే చెబుతుంది.

      తొలగించండి
  2. >> ఆంధ్రులకు ప్రస్తుతపరిస్థితుల్లో జీవించేహక్కు లేదనీ చెప్పరాదా?

    ఎందుకు చెప్పరాదు? విశ్వామితృలవరు చెప్పేరు(ట). అలా అంటూ మన ఆస్థాన సిద్ధాంతి గారు ప్రతీ సారీ చెప్తున్నారు. మీరు చదవట్లేదేవో. ఓట్లు దండుకున్నాక నెత్తిమీద చిప్ప పెట్టడం నీలం సంజీవరెడ్డి గారి కాలం నుండీ వచ్చినదే. ఆ రోజుల్లో రెడ్డిగారికి రాష్ట్రపతి పదవికి అమ్మగారు ఎలా టోపీ పెట్టారొ తెలియదా? ఇంకా ముందుకెళ్తె డిల్లీ వెళ్ళిన నాయకులు అమ్మగార్ని డబ్బులడుగుతే ఆవిడ ముష్టి విదిల్చేది. ఈవిడ (ఇంత కన్నా అసభ్య పదజాలం ఆవిడ ముందే వాడి) ఇంతేరా పద పోదాం అనుకుని వెనక్కి వచ్చేసేవారుట

    "ధర్మరక్షణ అనేదే లేదు. మోసాలు చేసేవాళ్ళు అలాగే చేస్తారు; వాళ్ళు హాయిగా ఉంటారు" అని నా కధలు చదివి ప్రతీసారి తిరక్కొట్టే సంపాదకుడూ, పెద్దాయన ఒకరు ఉవాచ.

    నీతి: అవసరం తీరిపోయక ఏ పార్టీ అయినా ఏ సంపాదకుడైనా ఒకటే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి. ప్రపంచాన్ని అవసరాలే శాసిస్తున్నాయి. నాడు వీలైనన్ని మద్దతులు బీజేపీకి అవసరం. వీలైనంత మద్దతు తెదేపాకు అవసరం. నిలకడగ ఉండే సమర్థమైన ప్రభుత్వం ఆంద్ర్హ ప్రజల అవసరం. కాబట్టి అప్పట్లో అలా పరిస్థ్తుతుల కనుగుణంగా జరిగింది. ఇప్పుడు ఎవరి అవసరాలు తీరినా తీరకపోయిన బీజేపీ అవసరం తీరింది. తెదేపా మద్దతు వారిదృష్టిలో ఒక గ్రుడ్డికన్ను. అవసరం కాదు. అందుకే మనముఖం మీదే పళ్ళికిలిస్తున్నారు. మన అవసరాలు తీరటం లేదింకా అందుకే దారులు వెతుక్కుంటున్నాం.

      తొలగించండి
    2. "తెదేపా మద్దతు వారిదృష్టిలో ఒక గ్రుడ్డికన్ను. అవసరం కాదు"

      అలా ఎందుకు అనుకోవాలి? ఇదే మాటను కాస్త మార్చి "బీజేపీ మద్దతు వారిదృష్టిలో ఒక గ్రుడ్డికన్ను. అవసరం కాదు" అని టీడీపీ గురించి అనలేమా?

      ఇంటికో ఉద్యోగం, సింగపూర్ తలదన్నే రాజధాని లాంటి ఎన్నికల వాగ్ధానాలు విఫలం అయ్యాయి. ప్రస్తుత చిందుబాటులు ప్రజల దృష్టిని దారి మళ్లించే ప్రయత్నం ఏమో?

      తొలగించండి
    3. తెలిసీ తమాషా మాటలు మాట్లాడకండి జై గారూ, రాష్ట్రంలో అదికారంలో ఉన్నా పార్టీవారు కేంద్రంలో ఉన్న అధికార పార్టీమద్ధతు అనవసరం అని ఎందుకు అనుకుంటారూ?
      ఇతరవిషయాలు మీరు ప్రస్తావించినవి నాకు చర్చనీయాలుగ కావిక్కడ. మీరు చర్చను సాగదీయాలనీ అనుకున్నా నాకు హితవు కాదు - విషయాన్ని ప్రక్కదారి పట్టించకండి దయచేసి. విషయం తెలుగువారికి జరుగుతున్న అన్యాయం గురించి కాని బాబునో డాబునో గురించి కాదు.

      తొలగించండి
    4. అలాగేనండీ దీనితో చర్చ ఆపేస్తాను. ఆంధ్ర ప్రజలు కేంద్రం అన్యాయం చేసిందన్న చంద్రబాబు మాట నమ్ముతారో లేదా మేమన్నీ బానే చేసామన్న బీజేపీ పక్షాన నిలబడుతారో ఇంకో ఏడాదిలో తెలిసిపోతుంది.

      2014 ఎన్నికలలో కూటమిలో భాగంగా పోటీ చేసిన బీజేపీకి కేవలం 2.8% ఓట్లు వచ్చాయి. 2019లో విడిగా పోటీ చేస్తే ఎన్ని వస్తాయో చూద్దాం!

      తొలగించండి
    5. " కేంద్రం అన్యాయం చేసిందన్న చంద్రబాబు మాట " - అది ఆంధ్ర ప్రజలు అందరి మాటానండీ. కేవలం బీజేపీ వాళ్ళని ప్రక్కన పెడితే. బీజేపీకి గర్వభంగం అవుతుందని ఆశిద్దాం. చర్చ ఆపేద్దాం ముందనుకున్నట్లే.

      తొలగించండి
  3. రాజధాని అమరావతి శంకుస్ధాపనకు గుప్పెడు మన్ను, ముంతడు నీళ్ళు మాత్రం తెచ్చిచ్చారుగా ఢిల్లీ నుండి. అదే రాబోవు కాలానికి సూచన అని ఆ నాడే తెలిసిందిగా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్షరాలా మీరు ఈ వ్యాఖ్య వ్రాస్తారని నా మనస్సుకు ఉదయమే తోచింది. శుష్కప్రియాలూ శూన్యహస్తాలూ చూపే వారి కుసంస్కారానికి ఒక నమస్కారం పెట్టి, ఇప్పుడు డబాయించి అడగటమే! ఎవడబ్బ సొమ్మని ఎగ్గడుతున్నారూ అని.

      తొలగించండి
    2. // “అక్షరాలా మీరు ఈ వ్యాఖ్య వ్రాస్తారని ....” //
      Clairvoyance?? నేను వ్రాస్తాననిపించిందా, ఎవరో ఒకరు అటువంటి వ్యాఖ్య వ్రాస్తారనిపించిందా? ఒకవేళ నేననిపిస్తే గనక నా ధోరణి అంత తేటతెల్లంగా ఉంటుందా అనే కుతూహలం కొద్దీ అడుగుతున్నాను.
      డబాయించి అడిగే స్ధితిలో ఉందంటారా ఏపీ? టీడీపీకి పార్లమెంటులో సంఖ్యాబలమా లేదు, సఖ్యతా ఇప్పుడు చెడింది. చూశారుగా, రైల్వే జోనా బ్బె బ్బె బ్బె అనేశారు రాజీనామాల మర్నాడే. కక్ష సాధింపుకి దిగిన తరువాత ఇంకేం జరుగుతుంది?

      తొలగించండి
    3. ఎందుకో తెలియదండీ. మీరు ఈ వ్యాఖ్య వ్రాస్తారని అనిపించింది. కాకతాళీయం అనుకోండి పోనీ.

      తొలగించండి
    4. కాకతాళీయం కావొచ్చును కానీ ఈ రెంటినీ కలిపి చూస్తే ఎదో అనుమానం పొడసూపుతుంది.

      1. లోకేష్ బాబుపై పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలు (శేఖర్ రెడ్డి & ఇసుక మాఫియా)
      2. అనూహ్య పరిస్థితులలో ప్రముఖ లాయర్ టీడీపీ రాజ్యసభ అభ్యర్థి

      తొలగించండి
    5. అనుమానం దేనికి?

      ఒక్క త్రాటిపై నడవగల మనస్తత్త్వం ఆంధ్రులకు ఉంటే అప్పట్లో కుట్రలద్వారా కొన్ని భూభాగాలను పోగొట్టుకొనేదీ కాదు మరికొన్ని కుట్రలపుణ్యమా అని నిన్నమొన్నట్ విభజన జరిగేదీ కాదు.

      ప్రస్తుతపు అనుమనం మీకు ఆనందం కలిస్తుందేమో తెలియదు. నాబోంట్లు నిర్వేదంతో తిలకించటం మాత్రం చేస్తున్నాం.

      అన్ని నాటకాలకూ కాలం తెరదించేరోజూ వస్తుంది. అది నేను చూడలేకపోవచ్చును. అది వేరే సంగతి.

      తొలగించండి
    6. నేను ఆ చర్చను నిన్నే ఆపేశానండీ. మళ్ళీ వచ్చే ఏడాది ఎన్నికల తరువాత చూద్దాం.

      నా ప్రస్తుత వ్యాఖ్య coincidence vs. telepathy గురించి.

      తొలగించండి
    7. ఇసుక మాఫియా అబద్దం. ఫ్రీగా వస్తుందని మా ఊర్లో అందరూ తెచ్చుకుని ఇంట్లో నిలవ చేసుకున్నారు. ఫ్రీ అని ముఖ్య మంత్రి స్వయంగా ప్రకటించాక 15 వేలు పెట్టి ఎవరు కొంటారు ? ఒకవేళ 15 వేలకి ఎవరైనా అమ్మితే తల్లి పాలు తాగి పెరిగినవాడై ఉండడు. ఆంధ్రులు ఇటువంటి వారని తెలిసే తెలంగాణా వారు విడిపోయారు.

      తొలగించండి
  4. బిజెపి ఒక బుచికి పార్టీ. మనం అంతలా బాధ పడటం అనవసరం. చింతకాయ రైల్వే జోను రాకపోతే ఏమి. ఏదోలా బతికెయ్యటమే. పెతిరోజు పార్లమెంటులో గొడవ చేసినా ఉపయోగంలేదు. బీజేపీ కాంగ్రెసు తెలుగుదేశం అందరు కలిసి తెలుగువాళ్ళను బుచికి బుచికి చేసి వదిలేసారు.కష్టపడటం మనకు అలవాటే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కష్టపడవద్దని ఎవరన్నారు?
      కాని ఏదోలా బ్రతికేయటమే ఏమిటి అసహ్యంగా?
      జీవఛ్ఛవాల్లా బ్రతకటం దేనికి?

      తొలగించండి
  5. ఇప్పుడే టీవీలో చూసిన ప్రశ్న: A1 A2 లను ప్రధాని కలవటంలో అర్థ మేమిటి?

    జవాబు: ఏమో. ఒక కేసులో ఏ1 ఏ2లు అంతకన్నా పెద్దకేసులోని ఏ1 గారిని కలిసారేమో.

    రిప్లయితొలగించండి
  6. ప్రత్యేక హోదా సంజీవని కాదని, దానికంటే ఎంతో ఉత్తమమయిన పాకేజీ దొరికిందని గతంలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే సెలవిచ్చారు. సదరు ఘనతకు మూల కారకులు మీరే అంటూ వెంకయ్య నాయుడు గారికి అర్జంటుగా శాలువా కప్పేశారు కూడా!

    ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఒక్కడే అన్యాయం జరిగిపొయిందహో అంటూ పెడబొబ్బలు పెట్టాడు. లంచగొండివి, వేల కోట్లు దోచుకున్నావు, నువ్వు మాకు చెప్పేదేంటని పసుపు & కాషాయ చొక్కాలు విరుచుకుపడ్డాయి.

    అంతర్జాల సంచారులు గమ్మునున్నారు, కాస్తోకూస్తో నోరెత్తిన కొద్దీ మంది "మంచి వాడు మా బాబు, దేవుని బిడ్డడు దొంగ వెధవ" పాట ఎత్తుకున్నారు.

    అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారలేదు. మారినవి రెండే విషయాలు: టీడీపీకి బీజేపీతో తెగింది, అదే సమయంలో ఎన్నికలు దగ్గర పడ్డాయి. బాబు గారు పల్లవి మార్చి ప్రత్యేక హోదాయే ముద్దు, మోడీ మనల్ని ముంచేశాడు వగైరా కొత్త రాగాలు ఎత్తుకున్నారు. బ్లాగ్లోకం ఇదే మూసలో దద్దరిల్లింది.

    ఎందుకో ఈ విచిత్రం? ఏమిటో ఈ ప్రవర్తనకు కారణం?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు వస్తారని ఊహించాను.

      తెలంగాణాను ఏమీ అనటం లేదు లెండీ ఇక్కడ.

      పరిస్థితులు మారాయి. ఒకప్పుడు అవసరం ఐన తెదేపా మద్దతు ఇప్పుడు భాజపాకు అనవసరం ఐనది.

      విచిత్రం ఏమీలేదు. బ్రతకాలన్న ఆశ. ఎలా బ్రతకాలీ అన్న అందోళన.
      మొదటిరోజునుండే లడాయి పెట్టుకోలేరు. చూసినన్నాళ్ళు ఎదురుచూసారు - బలమైన కేంద్రం అన్నమాటను నిలబెట్టుకోవాలని బ్రతిమాలి బ్రతిమాలి భంగపడ్డారు.

      మీకు వినోదంగా ఉంటే ఉండనివ్వండి.
      ఇక్కడ ఒక బ్రతుకు పోరాటం జరుగుతోంది.

      దొంగేడుపులు కావు.

      మీరలా అనుకొని వినోదిస్తామంటే మీ యిష్టం - మీతో వాదించాలన్న ఆసక్తి లేదు. అవసరమూ లేదు.

      దోపిడీకి గురైన వారు ధనవంతమైన రాష్ట్రం గానూ దోపిడీ దారులూ అని తిట్లుపడ్డ వారు బీదలుగానూ మిగిలిన అతిగొప్ప అక్షరాలా దొంగ రాష్ట్రవిభజన కన్నా, ఇప్పుడూ విచిత్రాలు ఏమీ జరగలేదు.

      మీ వ్యాఖ్యలోని యితర రాజకీయ వాక్యాలపైన స్పందన అనవసరం అనుకున్నాను.

      తొలగించండి
    2. నేను తెలంగాణ గురించి ఏమీ అనలేదు మీకెట్లా కనిపించిందో.

      జగన్ అన్నప్పుడు నమ్మని వాళ్ళు అందరూ ఇప్పుడు అవే మాటలను చంద్రబాబు అంటే ఎలా నమ్ముతున్నారన్నదే నా వింత.

      తొలగించండి
    3. వింతపడండి.
      ఈ ఆంధ్రులని ఎంతముంచినా ఇంకా బ్రతికే ఉన్నారే అని వింతపడండి.
      జగన్ గురించి చర్చ లేదిక్కడ. మీరు లేవదీసినా పట్టించుకోను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.