7, మార్చి 2018, బుధవారం

నుతించవే శ్రీరాముని నోటిగూటి చిలుకా


అతడిచ్చిన ఫలములే ఆరగించు చున్నావే
నుతించవే శ్రీరాముని నోటిగూటి చిలుకా

ప్రొద్దున లేచినది మొదలు నిధ్దురలో నొఱగుదాక
పెద్దలు పిన్నలును నిన్ను తద్దయు శ్లాఘించగ
ముద్దుముధ్దు మాటలతో మురిపాల పాటలతో
హద్దుపధ్దులేకుండ ఆడిపాడవే చిలుకా

అవల కివల కెగురుచుండు ఆటపాటల చిలుకా
యెవడు యునికి నిచ్చెనో యెవడు గూటి నిచ్చెనో
యెవడు పాట నిచ్చెనో యెవడు కూటి నిచ్చెనో
కవితలతో నా రాముని ఘనత పొగడవే చిలుకా

పాపాత్ముల తోడ నీవు పలుకాడకే చిలుకా
కోపాలసులుందురని గొంతు దాచకే చిలుకా
తాపత్రయశమనుడైన ధర్మావతారుడైన
నీ పాలిటి దేవునకై నీవు పాడవే చిలుకా


1 కామెంట్‌:


  1. అతడిచ్చిన ఫలములే ఆరగించు చున్నావే
    నుతించవే శ్రీరాముని నోటిగూటి చిలకా

    అన్నకీర్తనతో నాలుగవ సంకీర్తనాశతకం ప్రారంభం.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.