6, మార్చి 2018, మంగళవారం

రామద్వేషుల వ్రాతలు చేతలు


రామద్వేషుల వ్రాతలు చేతలు
నామది కలచును కామారీ

హరి నెఱిగింపని యరకొర చదువులు
హరి బోనాడేడు నఱకొఱ బుధ్ధులు
నరులు కొందరు నానావిధముల
బరితెగించి దుర్భాషలాడెదరు

తిట్టుచు హరిని తిరిగెడు వారికి
పట్టుబట్టి శివ యెట్టులైన నిక
గట్టిగ బుధ్ధిని గరపవయా యీ
బెట్టిదులను తుదముట్టించవయా

హరిహరద్వేషుల కమంగళములును
హరిహరభక్తుల కన్ని శుభములును
పరమదయాపర పరమేశ్వర యీ
ధరపై వెలయగ దయచూపవయా


1 కామెంట్‌:

  1. రామారి చేతల గురించి కామారికి విన్నవిస్తున్నారు. అరమరికలు లేనివారు హరిహరులని కాబోలు !

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.