4, జనవరి 2016, సోమవారం

వసుధావృత్తంలో మనవి.


     వసుధ.
     నిను వేడుదునే
     కనవేల నయా
     జనకాత్మజనే
     వినువాడ వొకో
వసుధ.
ఈ వసుధా వృత్తానికి గణవిభజన స-స. అంటే పాదానికి ఆరు అక్షరాలు. ప్రాస అవసరం. యతిస్థానం అవసరం లేదు.
ఈ వసుధా వృత్తానికి  కిసలయ అనీ తిలక అనీ కూడా మరొక రెండు పేర్లు ఉన్నాయని తెలుస్తోంది.

సులభమైన పద్యం.

పాదం నిడివి తోటకం‌ పాదం‌ నిడివిలో సగం!  అవే స-గణాలు. కాబట్టి తోటకంలో వసుధావృత్తాన్ని ఇమిడ్చి వ్రాయవచ్చును, చిత్రకవిత్వంగా.