మదనకము. చిరుచిరు నగవులతో కరుణను కురియవయా నిరుపమశుభనిలయా వరదశరథతనయా |
మదనకము.
ఈ మదనక వృత్తానికి గణవిభజన న-న-స . గురులఘుక్రమం III III IIU అవుతున్నది.అంటే పాదానికి కల తొమ్మిది అక్షరాలలో ఎనిమిది లఘువుల తరువాత ఒక గురువు అన్నమాట. పాదం నిడివి తొమ్మిది అక్షరాలే కాబట్టి యతిమైత్రి అక్కరలేదు. ప్రాసనియమం తప్పదు.
ఈ మదనక వృత్తానికే కమలావృత్తము, లఘుమణిగణనికరము అన్నపేర్లు కూడా ఉన్నాయి.
ఈ మదనక వృత్తంలో చివరన ఉన్న స-గణాన్ని తీసివేసి అక్కడ మ-గణం ఉంచితే అది భుజగశిశురుతము (భుజగశీశుభృతము) అన్న వృత్తంగా మారుతుంది.
పూర్వకవి ప్రయోగాలు తెలియవు.
తనుమధ్య చెప్పినట్టులేదండి. మదరేఖ చెప్పండి. చెప్పిన పద్యం బాగుంది.
రిప్లయితొలగించండితనుమధ్య ఇప్పుడే వచ్చిందండీ. దానితో ఈరోజున రాములవారికి పద్యత్రయం చెప్పినట్లైనది. అంబుజ, మదనక, తనుమధ్యల రూపంలో
తొలగించండిమదరేఖ కూడా వచ్చేసిందండీ. మీదే ఆలస్యం.
రిప్లయితొలగించండి