రామభోగి. లేరు శ్రీరాముని సాటిగా ధారుణిం జూపగ వెవ్వరుం జేరుమా రాముని పాదముల్ కోరుమా మోక్షము వేడుకన్ |
రామభోగి.
ఈ రామభోగి అనేది నేను కొత్తగా కల్పించుకున్న చిన్న వృత్తం
రామభోగికి గణవిభజన ర-భ-ర . పాదానికి 9 అక్షరాలే కాబట్టి, యతిస్థానం అవసరం లేదు
ఈ భోగి వృత్తానికీ భౌరిక వృత్తానికీ దగ్గరి చుట్టరికం. దీని గణాలు ర-భ-ర ఐతే భౌరికానికి ర-ర-ర. ఆరవస్థానంలో ఉన్న లఘువును తీసి గురువును ఉంచితే అది భౌరికం అవుతున్నది! ఆ భౌరికాన్ని విడిగా చూద్దాం.
ఈ రామభోగి వృత్తానికి గురులఘుక్రమం UIUUIIUIU. ఈ గురులఘుక్రమం మరికొన్ని తెలిసిన వృత్తాలలో అంతర్భాగంగా ఉంది.
వృత్తం | గురులఘుక్రమం |
ఇంద్రవజ్రం | UUI UUI IUI UU |
ఉపేంద్రవజ్రం | IUI UUI IUI UU |
ఇందువంశ | UUI UUI IUI UIU |
నిమగ్నకీల | IUI UUI IUI UUI |
వంశస్థం | IUI UUI IUI UIU |
అంబుదావళి | IIU IUU IIU IUI U |
కరపల్లవోద్గత | IUU IUU IIU IUI U |
వృధ్ధవామ | UUI UUI IUI UUI U |
సార్థపాద | UIU IUU IIU IUI U |
ఇలా ఈ భోగివృత్తం మరితొమ్మిది వృత్తాల్లో అంతర్భాగం అవుతున్నది కాబట్టి చిత్రకవిత్వప్రియులకు ఇది మరింత ఆసక్తి కలిగించ వచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.