అంబుజము. ప్రేమమయుడౌ క్షేమకరుడౌ రాము డొకడే స్వామి యనగన్ అంబుజము. నీ కరుణయే నా కొఱకునై వాకలుగ రా మా కలుగనీ |
అంబుజము.
ఈ అంబుజవృత్తానికి గణవిభజన భ-లగ (భ-వ). అంటే పాదానికి 5 అక్షరాలే. కాబట్టి ప్రాసనియమమే కాని యతిమైత్రిస్థానం అవసరం లేదు.
ఈ వృత్తానికి మండలం అని మరొక పేరు కూడా ఉంది.
ఈ వృత్తంలో గురులఘుక్రమం UII IU. ఈ క్రమాన్ని కుడినుండి ఎడమకు చదివినా అదే అవుతున్నది.
అంబుజ వృత్తపు నడక విషయం చూదాం. పాదానికి రెండుగురువులూ వాటి మధ్యన మూడు లఘువులూ ఉన్నాయి. ఏ లఘువు పైన ఐనా సరే విరుపు వచ్చే అవకాశం ఉన్నది. ఏ లఘువుపైనా విరుపు రాకపోయే అవకాశమూ ఉన్నది. కాబట్టి నిర్ధిష్టమైన నడక లేదు.
పైన నేను చెప్పిన మొదటి పద్యంలో నాలుగు పాదాల్లోనూ మొదటి రెండు స్థానాల తరువాత విరుపు వచ్చింది పదవిరామం కారణంగా. పద్యం అంతా అలాగు రావటం యాదృఛ్ఛికం. నియమంగా అలా రావాలని లేదు. మరొక రకంగా విరుపులు చూపటం రెండవ పద్యంలో గమనించండి.
పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.