6, జనవరి 2016, బుధవారం

శ్రీరామం‌ వసుమతీశం నమామి.






     వసుమతి.
     శ్రీరామ యనవే
     యా రామకృపచే
     చేరంగ నగునే
     తీరంబు మనసా
    



వసుమతి.

ఇదొక చిట్టిపొట్టి వృత్తం. పాదానికి గణవిభజన త-స.  అంటే పాదానికి ఆరు అక్షరాలే. యతిస్థానం లేదు. ప్రాసనియమం ఉంది.

పూర్వకవి ప్రయోగాలు తెలియవు.

8 కామెంట్‌లు:

  1. ధాత్రిన్ వసుమతిన్
    నేత్రోత్సవముగా
    క్షేత్రజ్ఞునెఱుకన్
    జిత్రింప మనసౌ
    http://chandam.apphb.com/?chandassu=vasumati

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. రాజారావుగారూ,
      ఈ పద్యంలో మూడవపాదంలో గణభంగం‌ ఐనది. మరొకవిషయం. గ్రంథభాషపై మీరు మీరు మరింత పట్టు సాధిస్తే పద్యాలు మరింత సొగసుగా వస్తాయి.

      తొలగించండి
    2. నోరార బిలువా
      ఏరా పలుకవూ
      రారా రఘువరా
      ఈరా శుభములూ

      తొలగించండి
    3. గ్రాంధి కమ్ము బిగువు గ్రామీణ సొబగుతో
      సాటి రాదు , జనుల పాటి గారు
      పండితులును కవులు భావ సంపత్తిలో
      భాష కన్న హృదయ పధము మిన్న .

      తొలగించండి
    4. రాజారావుగారూ, నేను వాదవివాదాల జోలికి పోదలచుకో లేదు. మీతో ఏకీభవించలేక పోతున్నందుకు మన్నించండి. వ్యావహారికం‌ అందమూ‌ ప్రయోజనమూ వ్యావహారికానిది. గ్రాంథికభాష అందమూ‌ ప్రయోజనమూ దానిది. ఇవి రెడూ నా దృష్టిలో పరస్పరపూరకాలు. వ్యవహారభాషలో జిగిబిగిదీర్ఘసమాసాడంబరాలు ఎలా శోభించవో, గ్రాంథికభాష వ్రాసేటప్పుడు దాన్ని సరిగా ప్రయోగించకపోతే అదీ శోభించదు. మనిషి ఒకడే‌ ఐనా సందర్భోచితంగా ఎలా భాషా ఆహార్యాలు ప్రదర్శిస్తాడో అలాగే కవిత్వం చెప్పే కవి కూడా ఎటువంటి భాషకు పీటవేసి కవిత్వం చెబుతున్నదీ తెలిసి తదనుగుణంగా సష్టువైన తీరులో వ్రాస్తాడు. మీరు గ్రాంథికం వ్రాయాలని యత్నిస్తున్నట్లు నాకు కనిపిస్తోంది కాబట్టి మీరు గ్రంథభాషపై మరింత పట్టు సాధిస్తే బాగుంటుందని సూచించానే‌ కాని చిన్నబుచ్చే ఉద్దేశం‌ ఏమీ‌ లేదు. కాదూ మీరు వ్యావహారిక భాషలో వ్రాస్తున్నా నంటారా, క్షమించాలి. మీరు వ్రాస్తున్నది వ్యావహారిక భాషలో‌ కానే‌ కాదు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో‌ అంటాడు కదా, 'చనుమొక దారిని' అని, అలాగు మీరు ఏదో‌ ఒక పధ్ధతిని ఎంచుకొని కృషి చేయండి. నాది అతిసాహసం అని మీకు అనిపించి నొవ్వు కలిగితే మన్నించమని చేతులు జోడిస్తున్నాను.

      తొలగించండి
    5. రాముని మీది ప్రేముడిని వ్రాసితి గాని , మరేమి గాదు , మీ
      రేమనుకున్న గ్రాంధికపు రీతికి నేను చనన్ , మనోజ్ఞమౌ
      కోమల గ్రామ సీమలను కూసిన కోయిల పాట తీరుగా
      ఆమనిలోని రాగముల హాయిని గొల్పును దెన్గు నెన్నుడుల్

      తొలగించండి
    6. రాజారావుగారూ,
      మిమ్మల్ని గ్రాంథికభాషలో వ్రాయమని ఒత్తిడి ఏమీ చేయటం‌ లేదండీ. మీకు వ్యావహారికభాష యిష్టమైతే ఇబ్బందేముంది నాకు? కాని అటు గ్రాంథికం ఇటు వ్యావహారికం కాని భాష అంత సొగసుగా ఉండదండి, ముఖ్యంగా పద్యాల్లో.అంతకంటే మరేమీ‌ లేదు. కాని ఇక్కడ నడుస్తున్నవి సంప్రదాయిక కవిత్వప్రక్రియకు సంబంధించిన విషయాలు కాబట్టి వాటిని ఆ పధ్ధతిలో సుష్టువుగా వ్రాయవలసిందిగా విన్నపం అంతే. తద్విపర్యంగా ప్రచురించలేనని సవినయంగా నా మనవి. ఈ విషయంలో అభిప్రాయాలు పంచుకున్నాం‌ కాబట్టి ఇంక ముగిద్దాం.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.